నేను ఈ టపా రాసేటప్పటికే అంతర్జాలమంతా గూగుల్ వాడి కొత్త నిర్వహణా వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టం) గురించి హోరెత్తుతుంటుంది.
ఇంతకీ ఆ ప్రకటన సారాంశమేమిటంటే గూగుల్ లినక్స్ కెర్నెల్ ఆధారితంగా ఒక కొత్త నిర్వహణా వ్యవస్థని ఈ సంవత్సరం విడుదల చేయనుంది. దీని ముఖ్యోద్దేశం ఒక విహరిణిని నిర్వహణా వ్యవస్థగా మలచడం.
(నిజం చెప్పుకోవాలంటే ఇది పెద్ద ఆశ్చర్యపరచే ప్రకటన కాదు. గూగుల్ క్రోమ్‌ని విడుదల చేసినప్పుడే దానిని ఒక విహరిణిగా కాక ఒక ప్లాట్‌ఫారంగా ఉపయోగించుకుంటుందని చాలా మంది ఊహించారు. ఇప్పుడు అది నిజమయింది అంతే!)
ఇంతకు ముందు కూడా నా టపాలలో ప్రస్తుతం ఆన్లైను ఉపకరణాలు ఎలా విస్తరిస్తున్నాయో చెప్పటానికి ప్రయత్నించాను. అలాగే ఆన్లైనుకీ ఆఫ్లైనుకీ మధ్య దూరాన్ని ఎలా చెరిపేస్తున్నాయో కూడా చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు దానిని ఇంకో అడుగు ముందుకు వేయించడానికి గూగుల్ ఈ ఆలోచనతో ముందుకు వచ్చింది.
"గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్" లక్ష్యమేమిటో వారి బ్లాగు టపాలో ఈ క్రింది వాక్యం చెబుతుంది.
The software architecture is simple — Google Chrome running within a new windowing system on top of a Linux kernel. For application developers, the web is the platform
అంటే ఈ నిర్వహణా వ్యవస్థ ముఖ్య ఉపయోగం వినియోగదారుడికి ఒక విహరిణిని అందించేంత వరకే. తర్వాత కార్యకలాపాలన్నీ విహరిణి పైనే (గూగుల్‌కి గూగుల్ క్రోమ్).
అయితే ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. ఇప్పటికే నెట్‌బుక్‌ల పేరిట ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. సఫలమయ్యాయి. ఈ నెట్‌బుక్‌ల కోసం ఇప్పటి వరకూ ప్రముఖంగా విండోస్ ఎక్స్పీ, లినక్సు ఉపయోగించబడ్డాయి. ఉబుంటు తయారీదారులు కానానికల్ వారయితే దీని కోసం ఒక ప్రత్యేకమయిన ఉబుంటు వర్షనుని (Ubuntu Netbook Remix) కూడా సృష్టించారు.
ఇది మనకి ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమో కానీ ఇది పరిణామ క్రమం. ప్రస్తుత కాలం వరకూ మన కార్యకలాపాలన్నిటికీ మనం ఒక పటిష్ఠమయిన నిర్వహణా వ్యవస్థ మీద ఆధారపడ్డాము. దానిని మైక్రోసాఫ్టు విండోసు, లినక్సు, ఆపిల్ వాడి మాక్ వంటివి అందించేవి.
అయితే ప్రస్తుత పరిణామాలన్నీ పై క్రమాన్ని వదిలి మన కార్యకలాపాలని ఆన్లైనుకి మారుస్తున్నాయి. ఉదా: ఆఫీసు ఉపకరణాలు మొదలయినవి గూగుల్ డాక్స్, జోహో ద్వారా లభ్యం. అలాగే అంతర్జాలంతో అనుసంధానం కాకపోయినా పని చేసుకోవడానికి గూగుల్ గేర్స్ వంటి ఉపకరణాలూ లభ్యం.
అయితే మరి గూగుల్‌కి దీని వల్ల లాభం ఏమిటి ?
ముఖ్యంగా చెప్పుకోవాలంటే గూగుల్ మైక్రోసాఫ్టు, ఆపిల్ వంటి వాటిని నిర్వహణా వ్యవస్థలో ఎదుర్కొనలేదు. వాటికి పోటీనివ్వలేదు. అయినా ఈ నిర్వహణా వ్య్వస్థని ఎందుకు సృష్టిస్తుందంటే గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అవి ఆక్రమించని వ్యాపారాన్ని ఇది త్వరగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది.
గూగుల్ వాడి ఆస్తులన్నీ ఆన్లయిననే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నిర్వహణా వ్యవస్థ ద్వారా వినియోగదారులని విహరిణికి అతుక్కునేలా చెయ్యగలగడం ఒక ముఖ్యోద్దేశం.
ఇక ఇది గూగుల్ యొక్క నిర్వహణా వ్యవస్థ కాబట్టి ప్రతీ దాంట్లోనూ గూగుల్ ఉపకరణాల అనుసంధానం ఉంటుందని మనం ఊహించవచ్చు. ఎలాగంటే మీరు మెయిలు పంపాలంటే జీ-మెయిలు తెరుస్తుంది. మీరు ఒక డాక్యుమెంటు సృష్టించాలంటే గూగుల్ డాక్స్ తెరుస్తుంది. ఎవరికయినా Instant Message పంపాలంటే గూగుల్ టాక్ తెరుస్తుంది.
ఇలా గూగుల్ ఉపకరణాలన్నీ ప్రీ ఇన్స్టాల్ అయి రావచ్చు. వినియోగదారుడికి కావలసిన అన్ని సేవలకూ గూగుల్ ఉపకరణాలని ఉపయోగించేలా ప్రేరేపించవచ్చు. ఇందువల్ల లాభాలు అందరికీ విదితమే.
గూగుల్ అన్ని ఉపకరణాల లాగానే ఇది కూడా ఉచితంగా లభ్యమవుతుంది, ఓపెన్ సోర్స్ అయి ఉంటుంది. ఓపెన్ సోర్స్ చెయ్యడం వల్ల జనాల్ని ఉచితంగా తన పని కోసం వినియోగించుకోవచ్చు, త్వరగా ఫీచర్లని విడుదల చెయ్యవచ్చు, ప్లాట్‌ఫారంని ఎక్స్టెన్సిబుల్‌గా తయారు చెయ్యవచ్చు. అదీ కాక గూగుల్‌కి ఉన్న బ్రాండ్ నేమ్ ద్వారా జనాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుంది.
ఇక దీని భవిష్యత్తేమిటో చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది.
ఇది చూడండి:
ఒక రకంగా గూగుల్ ఇప్పటికే ఒక ఓపెన్ సోర్సు నిర్వహణా వ్యవస్థని రూపొందించింది. అది ఆండ్రాయిడ్, అయితే అది మొబైళ్ళ కోసం తయారు చెయ్యబడినది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ని నెట్‌బుక్‌ల మీద పని చేయించడం కోసం వివిధ హార్డువేరు సృష్టికర్తలు ప్రయత్నిస్తున్నారు.
లినక్సు వాడే వారికి X11 విండో సిస్టం గురించి తెలిసే ఉంటుంది. నాకు అదంటే పెద్ద ఇష్టం లేదు. అంత స్టేబుల్‌గా ఉండదు. గూగుల్ ప్రకటనలో నాకు ఈ కింది వాక్యం ఆసక్తికరంగా అనిపించింది.
Google Chrome running within a new windowing system on top of a Linux kernel.
అయితే ఇప్పుడు లినక్సుకి ఒక సరికొత్త విండో సిస్టం వస్తుందేమో ? :-)

19 comments:
సూపరు!
వేడివేడి టెక్కు సమాచారం కోసం చూస్తూనే వుండండీ ప్రవీణ్ గార్లపాటిగారి బ్లాగు 'నా మదిలో ...'
ఆరు రంగులలోనూ మరియు తెలుగులోనూ! :-)
సూపర్ పోస్ట్
బైదవే - ఇలా తెలుగును ఆంగ్లంలో ఖూనే చేసే వారి మాటలు పట్టించుకునే ముందు వాళ్లను తెలుగులో వ్రాయమని చెప్పి మమ్ము రక్షించు :)
Praveen, I request you to discourage the anon comments such as above. Not because they are anon, but because they have no constructive discussion to offer, and only provide unnecessary distraction.
Kudos on yet another highly scintillating article. If you feel comfortable using words like viharini etc, more power to you!
"Google Chrome running within a new windowing system on top of a Linux kernel."
The new windowing system itself could be a chrome on top of a gnome, or KDE or XFCE. Just guessing :)
~sUryuDu
what is this ఖాతారేకు
ai canttu undarustaandoo
saradaagaa
Can this gu run on Ubuntu server too?
@ అందరికీ:
నే వాడిన పదాలు వినీ, చదివీ, వాడీ నాకు అలవాటయ్యాయి. కాబట్టి ఎబ్బెట్టుగా అనిపించట్లేదేమో!
అన్ని పదాలనూ తెలుగులో తర్జుమా చెయ్యనక్కర్లేదు. కానీ నేను కొత్త పదాలను ఉపయోగించి ప్రయత్నించదలచుకున్నాను.
దయ చేసి చర్చని టపాపై ఉంచండి.
@ రానారె:
చాన్నాళ్ళ తర్వాత దర్శనం, ఏంటి సంగతులు ?
@ కొత్తపాళీ గారు:
థాంక్స్. చర్చకి అనవసరమయిన వ్యాఖ్యలని తొలగించాను.
నాకు మోడరేషను పెట్టడం ఇష్టం లేదు. ఇన్నేళ్ళుగా పెట్టలేదు. ఇప్పుడు పెట్టవలసి వస్తే బాధాకరమే.
అందరూ కొద్దిగా సంయమనం పాటిస్తే ఆరోగ్యకరమయిన చర్చ జరుగుతుంది. లేకపోతే ఇక తప్పదనిపిస్తే మోడరేషను పెడతాను.
@ సూర్యుడు:
gnome, KDE, XFCE ఇవన్నీ X11 Windowing system ని ఉపయోగించుకుని పని చేసేవి. వాటంతటవి కేవలం Desktop Environments.
కాబట్టి Windowing system కొత్తది అంటే నాకు అలాగే అర్థమయింది. ఇక విడుదలయితే కానీ దాని సంగతి మనకి తెలియదనుకోండి :-)
@ బొల్లోజు బాబా గారు:
ఖాతారేకంటే Credit Card. అదీ సంగతి :-)
@ రమణ గారు:
దీనిని ప్రత్యేకంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గానే విడుదల చేస్తుంది గూగుల్. కాబట్టి విడిగా ఉబుంటు కానీ ఇంకే ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అక్కరలేదు.
అయితే దీనిని విడిగా లినక్స్ ప్యాకేజీలుగా కూడా అందిస్తారేమో లాంటివి వేచి చూడాల్సిందే.
how is this claimed as an OS when it is just an application suite on top of Open Source Kernel[Linux], this is more like a virtual windowing system making use of services offered by base line linux kernel.
I don't even agree to call chrome as an OS, Pls comment
ఆండ్రాయిడ్ అనుకున్నంత విజయవంతమైనట్లు లేదు కదా... బహుశా ఇదీ అదేబాట పడుతుందేమో అనిపించిందండీ.. ఆపరేటింగ్ సిస్టం కి స్టెబిలిటీ ముఖ్యం కలగూర గంప లా తలా ఒక చెయ్ వేయమని వదిలేస్తే నిలబడ్డం కష్టమనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో..
@ sunny:
Kernel just gives low level features like memory management, threading, drivers interfaces etc.
Most of the Linux distribution Kernels are derived from a common Linux Kernel source and they customize for their needs.
Google chrome OS is no different. It would be like any other distribution like Ubuntu, Fedora.
@ వేణూ శ్రీకాంత్:
అవును ఆండ్రాయిడ్ అనుకున్నంత విజయవంతం కాలేదు. అసలు ఐఫోన్ లాంటి మొబైల్ ఫోనుని తట్టుకుని నిలిచేవి కష్టమే.
అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. గూగుల్ వాడు చాలా ఫోకస్డ్ గానే చేస్తున్నాడండీ. కలగూరగంపగా చేయట్లేదు. కాకపోతే వాడి ఫోకస్ ఆన్లైన్ కార్యకలాపాల పైనే.
వాడు కనీసంలో కనీసంగా మంచి ఓఎస్ నే విడుదల చేస్తాడు. నేను చెప్పినదేమిటంటే ఓపెన్ సోర్స్ కాబట్టి తొందరగా వేరే జనాలు ఎక్స్టెండ్ చెయ్యవచ్చు.
Pure guessing:
"నేను చెప్పినదేమిటంటే ఓపెన్ సోర్స్ కాబట్టి తొందరగా వేరే జనాలు ఎక్స్టెండ్ చెయ్యవచ్చు"
I don't think he will allow the OS to extend. In my opinion, the underlying OS is not extendible, just like the underlying redhat linux in VMware. The google blog clearly says
"For application developers, the web is the platform."
Only extensible stuff is add-ons, if Chrome supports it in future, otherwise online utilities which can work well under chrome.
~sUryuDu
@ సూర్యుడు:
అవును. మీరు చెప్పిందే నిజం కావచ్చు.
క్రోమ్ (క్రోమియమ్) కి ఆడాన్ సపోర్టు ఆల్రడీ ఉంది. ఇది చూడండి.
చాలా బాగుంది టపా.....
నాకు చాలా రోజుల నుంచి ఒక అనుమానం.
అసలు గూగుల్ కి ఆదాయం ఎక్కడ నుండి వస్తోంది.
ఆడ్ సెన్స్, ఆడ్స్ వీటి వల్ల వచ్చెది సరిపొతుందా.....!
@ విశ్వక్శేనుడు:
అవును, గూగుల్ వాడి ఆదాయంలో అత్యధిక శాతం (తొంభైకి పైగా) ఆడ్స్ మీదే ఆధారపడి ఉంది. అది బిలియన్ల కొద్దీ రెవెన్యూని ఆర్జిస్తుంది.
దాని సహాయంతోనే మనకి ఇన్ని ఉచిత ?? (ప్రకటనల ఆధారితమయిన) మరిన్ని ఉపకరణాలు అందిస్తున్నాడు.
"ముఖ్యం కలగూర గంప లా తలా ఒక చెయ్ వేయమని వదిలేస్తే నిలబడ్డం కష్టమనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో."
Venu - Do you know the story of an OS called LINUX?
@ప్రవీణ్ గార్లపాటి
నా అనుమానం తీర్చినందుకు ధన్యవాధాలు.
కనీ నాకు మల్లీ ఇన్కొక అనుమానం....
అంటే గూగుల్ ఆఫీస్ లు, వాల్ల ఉద్యొగులకి ఇచ్చే జీతాలు అవి చూస్తే ఒపెన్ సోర్స్ ద్వారా ఇన్ని ఎలా ...అని
మీ టపా చాలా సందేశాత్మకంగా ఉంది. తెలుగులో క్రొత్త పదములు సృష్టించడం హర్షించదగిన విషయం, ఎందుకంటే ఒక భాషకు దానికున్న పదాల సంఖ్యలోనే బలమున్నది. మంచి ప్రయత్నం.
hello... hapi blogging... have a nice day! just visiting here....
Lovely post! Dropping by...
p/s: We would like to invite all of you to join our blogging community which helps you to get more visitors to your blogs. It's totally free and you get the chance to meet other celebrity bloggers. Visit us at Free Blog Traffic
Post a Comment