గత రెణ్ణెల్లలో ఇవీ నా అనుభవాలు. ఆఫీసు పనిలో భాగంగా అకస్మాత్తుగా "క్వీను గారి కంట్రీ"కి ప్రయాణం కట్టవలసి వచ్చింది.
తినే నోరూ, తిరిగే కాలూ ఊరకే ఉండవు కదా. అందుకే ఉన్నన్నాళ్ళూ నానా చెత్తా తిని (తినవలసి వచ్చింది), తిరిగినన్ని ప్రదేశాలు తిరిగాను.

సంక్షిప్తంగా ఇవీ నా అనుభవాలు...

మా ఆఫీసు ఉన్న ప్రదేశం...



నా ట్రిప్పులో మిగతా అనుభవాలు...



































కుదిరితే తర్వాత లాగుతాను :-)

9 comments:

Vamsi M Maganti said...

మీరేమనుకున్నా....ఏమి బాగున్నా, ఎంత బాగున్నా, ఆ దేశమంటే పరమ చిరాకు నాకు.....జీవితంలో ఒకే ఒక సారి , నార్త్ వెస్టు, లుఫ్తాన్సా టిక్కెట్లు దొరక్క ఐయిర్ ఇండియాలో వస్తూ ఆ గడ్డ మీద కాలు పెట్టినందుకు ఇప్పటికీ చాలా పశ్చాత్తాపపడుతూ ఉంటాను.......వందకోట్ల నదుల్లో మునిగినా ఆ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు....ఏమిచ్చినా, ఎంతదిచ్చినా ఆ దేశంలో మటుకు అడుగు పెట్టేది లేదు......చాలా రోజుల తర్వాత కనపడ్డారని , టపా రాసారనీ - ఇంకేదో అనుకుని ఇటువైపు వచ్చా....:)...

శ్రీ said...

యూ.కే లో ట్రెక్కింగ్ వెళ్ళలేదా?

మేధ said...

8th photo lo merena..?! ;)

చైతన్య.ఎస్ said...

ఫోటో లు బాగున్నాయి

ప్రవీణ్ గార్లపాటి said...

@ వంశీ గారు:
భలే వారండీ, భారతం బయట ఉంటూ మీరిలా అనడం చోద్యం కాకపోతేనూ :P
మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ అది మీరు చేయరుగా :)

@ శ్రీ:
ఎందుకెళ్ళలేదండీ, ఇక్కడ పెట్టిన ఫోటోలలో బీచు ప్రాంతాలలోవన్నీ ఒక ఐలాండు. అక్కడ ట్రెక్కింగూ, బైకింగూ, కారింగూ అన్నీనూ...

@ మేధ:
చక్కని చుక్కా లేదు, గిటారూ రాదు. ఇక అది నేనెలా అవుతాను ? :P

@ చైతన్య:
థాంక్యూ!

Purnima said...

పొద్దున్నే గూగుల్ రీడర్ లో మీ పోస్టు చూసి, ఇంటికెళ్ళాక తీరిగ్గా "చదువుకోవచ్చూ" అనుకున్నా. మీరన్నీ బొమ్మలే పెట్టేశారు ఏంటీ? బొమ్మలు బాగున్నాయి అని (ఇప్పుడు) చెప్పను. బ్లాగండీ!

Vamsi M Maganti said...

అడిగారూ ? అనుకుంటునే వున్నా - - చిక్కు ప్రశ్న వస్తుందని - నా భారతదేశం బయట బస భారమయిన, భర్తృహరి శతకాలకు సమానమయిన సంగతి ...ఆ సంగతి గురించి చెప్పాలి అంటే "దిబ్బ" భాషలోనో, "పాళీ" భాషలోనో చెప్పాల్సి వస్తుంది.... :) విచిత్రమయింది కాబట్టి ....

కానీ మీరు అడిగారు కాబట్టి , మీకు ఆసక్తి ఉంది కాబట్టి, ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టీ వీలు చూసుకుని నా బ్లాగులోనే చెబుతాననిన్నీ......ఇకపోతే నా ప్రాయశ్చిత్తం "ఆ దేశానికి" మటుకు మాత్రమే సంబంధించినదనిన్నీ....మిగిలిన ప్రాయశ్చిత్తాలు, పుఠం పెట్టగా చిత్తరువులయిపోయినాయనిన్నీ....అయినా ఆ ఒక్క ప్రాయశ్చిత్తం ఏమిటొ మీరు చెప్పలేదు కాబట్టి, అప్పటిదాకా ఆవేదనతో చకోర(స్) పక్షిలా చూస్తూ ఉంటాననిన్నీ... ... :)

రవి said...

ఫోటోలు, దుమ్ము లేచిపోయాయి (దుమ్ము లేకపోయినా).

క్వీను గారి కంట్రీలో క్వీన్లే లేరా? కనీసం ఒక్క ఫోటో?

వేణూ శ్రీకాంత్ said...

ఫోటోలు బాగున్నాయ్...