ఓ చక్కని అబ్బాయి ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. చక్కని ఉద్యోగమూ ఉంది.
అతనికి నచ్చిన చెలి కూడా ఉంది. వరసయింది కూడాను. ఇద్దరూ ఎప్పటి నుంచో ఒకరినొకరు ఇష్టపడుతున్నారు.
అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది.

పాపం ఇద్దరూ దూరంగానే ఉండాలి పరిస్థితుల నిమిత్తం. అతని ఉద్యోగం ఇంకో ఊరిలోనాయె, అమ్మాయి చదివేది ఇంకో ఊరిలోనాయి. పాపం ఆ దూరం దుర్భరమే. అదీ కాక ఇంట్లో కొందరికి వాళ్ళు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు కూడాను. ఇక అబ్బాయి అయితే వాళ్ళ నాన్నతో తప్పదు కాబట్టి మాట్లాడతాడు. అమ్మంటే ఇష్టమే. కానీ వాళ్ళిద్దరి కంటే కూడా తను ప్రేమించిన అమ్మాయంటేనే ఇష్టం.
రోజూ వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవడమే. చిన్న చిన్న సరదా సన్నివేశాలు, సరసాల గురించి మాట్లాడుకోవడమే. నీకు నేనున్నానంటూ రోజూ ఆ అమ్మాయికి భరోసా ఇవ్వడమే.
ఇక చిన్న చిన్న గొడవలు లేకుండా ఆ అనుబంధంలో మజా ఏముంటుంది. చిన్న చిన్న తగువులు పడుతూనే ఉంటారు, సర్దుకు పోతుంటారు. ఒకరినొకరు బుజ్జగించుకుంటారు. ముద్దు ముద్దు మాటలు చెప్పుకుంటారు.

మరి ముందు కథ ఏమిటి ? వీళ్ళిద్దరూ ఒకటవుతారా‌ ? పెళ్ళి చేసుకుంటారా ? కథ సుఖాంతమవుతుందా ?

దీనికి సమాధానం కావాలంటే తప్పక చూడండి, లేదు వినండి నా క్యాబులో ప్రయాణించే కొలీగు మొబైలు సంభాషణలు :-)

మరదే! అవాక్కయ్యారా ?

నేనేదో సినిమా కథో, స్నేహితుడి కథో చెబుతున్నాననుకున్నారు కదూ. కాదు ఇది అచ్చంగా నాతో బాటు నా ఆఫీసు క్యాబులో ప్రయాణించే నా కొలీగు కథ. ఇంత డీటెయిల్డుగా నాకెలా తెలుసని మీరు ఆశ్చర్య పోతున్నారా‌?
అయ్యో మీకు నేను చెప్పింది చాలా తక్కువండీ బాబూ. నాకు అతడు ఆమెని ముద్దు పెట్టుకున్నాడో లేదో కూడా తెలుసు. వాళ్ళ పెళ్ళికి అడ్డంకి ఎవరో కూడా తెలుసు. దానికి అతను ఎలా ప్లాన్ చేస్తున్నాడో‌ కూడా తెలుసు.

ఒక నెల నాళ్ళ నుంచీ నా గతి అదీ. రాత్రి పూట ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరితే చాలు తల వాచిపోతుంది ఈ సంగతులు వినలేక. వరస పెట్టి రోజూ ఒక గంట సేపు నా బుఱ్ఱ వాచిపోయేలా ఆతడి వ్యక్తిగత సంగతులను మొబైలులో అరిచి మరీ నా చెవిన పడేస్తున్నాడు.
కనీసం నాకు తెలుగు రాకపోయినా బాగుండేది. కానీ వచ్చాయె. అది అతనికి తెలుసు కూడాను. చెప్పాలంటే మొహమాటం నాకు.
ఎట్టకేలకి నా క్యాబు మారడంతో తప్పించుకున్నాను, లేదు లేదు తప్పించుకున్నానని అనుకున్నాను.

ఇప్పుడేమయింది అంటారా ? ఇందులో ఓ కొత్తగా పెళ్ళి కుదిరిన తెలుగు కుఱ్ఱాడు, అందునా నాకు బాగా తెలిసిన వాడూ ఉన్నాడు. మళ్ళీ షరా మామూలే.
రాత్రవగానే నాకొక గంట సేపు స్వీట్ నథింగులు వినక తప్పదు. ఇక ఇలా కాదని నా ఎంపీత్రీ ప్లేయరుని హై వాల్యూములో పెట్టి అతను మొదలుపెట్టగానే నేనూ మొదలుపెడుతున్నాను. నా సమస్య కొంత వరకూ తీరింది. (కాకపోతే నా మొబైలు రింగయితే నాకు వినిపించదు, పక్కన జనాలు నాతో మాట్లాడినా నాకు తెలీదు, ఆఖరికి యాక్సిడెంటయినా నాకు తెలీదన్నమాట)

ఈ మధ్యన నేను క్యాబు ఎక్కగానే ఇంకెందుకు ఆలస్యం ? నీ ఎంపీత్రీ ప్లేయరు మొదలుపెట్టు అంటున్నాడు అతను. ఊ... అదీ సంగతి :-)

16 comments:

Anonymous said...

man u r too gud

రవి said...

ఒకటే పరిష్కారం దీనికి. మీరు ఇలాంటి కహానీ ఒకటి ఆరంభించడమే. (అంత వీజీ కాదనుకో!)

వేణూ శ్రీకాంత్ said...

హ హ భలే ఉన్నాయ్ మీ కష్టాలు :) ఇవ్వాళా రేపు ఇంతే నండీ బాబు, సెల్ ఫోన్ లో కబుర్లు చెప్పని వాళ్ళని చూస్తే ఆశ్చర్య పోవాలేమో కానీ ఇలాంటి వాళ్ళు సర్వ సాధారణం.

మేధ said...

హ్హహ్హ... ఇలాంటివి నాకు ఆఫీసులో జరిగాయి...కాకపోతే, మీ కధలో అబ్బాయి ఉంటే, నా కధలో అమ్మాయి! :(
ఏమి చేస్తాం.. ఆమె కధ నాకే కాదు, మా చుట్టుప్రక్కల కూర్చునే వారందరికీ తెలుసు..!!! కాకపోతే చివరికి, నేను ప్రాజెక్ట్ మారిపోవడంతో, ఆ గోల నుంఢి తప్పించుకున్నాను :)

bargavi said...

:-)

చైతన్య.ఎస్ said...

రవి గారి సలహా ఏదో బాగున్నట్టు ఉంది .. మరి మొదలెట్టండి :)) ( సరదాగా )

ప్రవీణ్ గార్లపాటి said...

@ Anonymous: Thank you!

@ రవి: ఆ టాలెంటే ఉంటే‌...

@ వేణూ శ్రీకాంత్: అంటేనంటారా ? నేను అబ్నార్మలేనా ?

@ మేధ: మీకూ అయిందీ అనుభవం. కనీసం ఆఫీసులో అయితే కనీసం హెడ్‌ఫోన్లు పెట్టుకుని బతకొచ్చు.

@ bargavi: :-)

@ చైతన్య‌: ఆయనకిచ్చిన సమాధానమే మీకూనూ ;-)

rams said...

i love the story man. sell it for a movie maker with some more spice in it.

చైతన్య said...

నిజంగానే అవాక్కయ్యానండి నేనయితే... ఏదో కథ చెప్తున్నారు అనుకున్నాను!

మీకో solution చెప్పమంటారా... వాళ్ళ మాటలు వినే అవసరం లేకుండా మీరే పడ్డాక ఫోనులో మాట్లాడుతూ ఉండండి... అప్పుడు వాళ్ళ మాటలూ వినిపించవు... మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి వాళ్ళ సంగతులు చెప్పనూ లేడు... మరి మీ ఫోన్ engage లో ఉంటుంది కదా...
మరి పద్దాకా ఎవరితో ఫోన్లో మాట్లాడాలి అని అనుకుంటున్నారా... మీరు కుడా ఒక అమ్మాయిని చుసేసుకోండి... ఓ పనైపోతుంది... ఏమంటారు? :)

కొత్త పాళీ said...

Romance, thrills, horror, heartbreak .. అన్నీ ఉన్న నవరసభరిత చిత్రం! అదే కేబు రైడు!! :)

రానారె said...

:-))
అదన్నమాట సంగతి!
నేనూ అవాక్కయ్యాను. కథలాగా భలే మొదలయింది. మరీ అప్పుడే ఐపోయిందనిపించింది. రెండోభాగం ఎప్పుడు?

karthika said...

hahaha so funny but happy ga meeku cab lo timepass ayyipotundi kaduu :).

Karthika
http://nenu-nenuga.blogspot.com/

ప్రవీణ్ గార్లపాటి said...

@rams: మీ వ్యాఖ్య వ్యంగ్యమో కాదో అర్థం కాలా :P

@చైతన్య: భలే వారే!

@కొత్త పాళీ: మరే! షేరింగు ఆటో‌ కూడానూ :-)

@రానారె: రెండో భాగం పరిస్థితులు తారుమారయినప్పుడు. ;-)

@karthika: టైంపాసా పాడా ? చెవులు చిల్లులు పడుతున్నాయండీ బాబూ!

చేతన said...

abbo, alaanti vaallatoa chaala kashtamandi babu, cab rides, sharing auto, roommates, anniti tho idey godava. janaala pakkaney haayi ga darjaaga kurchuni muddulu, i-love-you-lu, sweet nothings, gaaraalu. idi na private matter aney feeling, most personal thing with most precious person aney special feelingu undavemo. naakemo maa amma tho fone lo mataladalanna pakkana evaru undakudadu.

anand said...

lite teeskodi. ivanni maamoole.

anand said...

abbayile kadu. ammayilu kooda ilantivi chestunnaru itarula drustini tama vipu tippukodaniki mari gattiga maatladutaru.

SPECIALLY maatimaatiki navvadam etc., enduko mari vaarike teliyali