మీ రోజువారీ కార్యకలాపాలను డెస్కుటాపు మీద నుంచి ఆన్‌లైనుకి మళ్ళించడానికి ఎన్నెన్నో ఉపకరణాలు పుట్టుకొస్తున్నాయి. అవి కొంత మేరకు సఫలమవుతున్నాయి కూడాను.
అన్నిటికన్నా ఎక్కువగా గూగుల్, జోహో ఇది సాధించడంలో ముందున్నాయి. దానికి కారణం అవి ఏ ఒక్క ఆఫీసు ఉపకరణానికో మాత్రమే పరిమితం కాక మైక్రోసాఫ్టు ఆఫీసు తయారు చేసినట్టు ఒక ఆఫీసు సూట్ మొత్తాన్ని సృష్టించడానికి ప్రయత్నించడమే. అంతే కాకుండా ఇవి ఈ ఉపకరణాలన్నిటినీ చక్కగా అనుసంధానిస్తున్నాయి. (ఉదా: జీమెయిలు లో నుంచి మీరు గూగుల్ డాక్స్ కి చెందిన డాక్యుమెంట్లు చూడగలరు, మీ మెయిలుకి జత చేసి ఉన్న అటాచిమెంట్లను గూగుల్ డాక్స్‌లో దాచుకోగలరు.)
ఇప్పటికయితే ఇవి నా పరంగా ఏ విధంగానూ డెస్కుటాపుని రీప్లేస్ చెయ్యలేదు. అయితే నా వ్యక్తిగతానికి సంబంధించిన ఫైళ్ళను చాలా మటుకు ఇప్పుడు ఆన్లయినులో (ముఖ్యంగా గూగుల్ డాక్స్‌లో) భద్రపరుచుకుంటాను. దానికి అనేక కారణాలు. నేను పని చేసే కంప్యూటరు అందుబాటులో లేకపోయినా నా ఫైళ్ళు నాకు అందుబాటులో ఉంటాయి.
ఫైళ్ళలో చేసిన మార్పులను అన్ని కంప్యూటర్లలోనూ విడివిడిగా చేసుకోనక్కర్లేకుండా ఒక దగ్గరే చేసుకోవచ్చు. అంతే కాకుండా డెస్కుటాపు ఉపకరణాలలో ప్రస్తుతం సాధ్యం కాని విధంగా వివిధ వ్యక్తులతో కలిసి ఒకే డాక్యుమెంటు పైన పని చేసుకోవచ్చు.
అయితే ఈ మధ్య వరకూ డెస్కుటాపు ఉపకరణాలు ఒక కారణం చేత ఈ ఆన్లయిను వాటి మీద పై చెయ్యి అయి ఉండేవి. ఆన్లయిను ఉపకరణాలని ఉపయోగించాలంటే అంతర్జాలానికి అనుసంధానమయి ఉండాలి. అన్ని వేళలా, అన్ని చోట్లా అంతర్జాలానికి అనుసంధానమయి ఉండడమనేది ప్రస్తుత కాలంలోనూ సాధ్యం కాదు.
ఈ సమస్యని దూరం చెయ్యడానికి గూగుల్ తయారు చేసిన గూగుల్ గేర్స్ అద్భుతమయిన ప్రత్యామ్నాయాలను కల్పిస్తున్నది.
గూగుల్ గేర్స్ ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరు. దీనిని ఉపయోగించుకుని మీరు వెబ్‌సైటులను, అవి అందించే సర్వీసులని ఆఫ్లైనులో కూడా పొందవచ్చు.
ఇది దీనంతట ఇదే ఒక సాఫ్టువేరు కాదు. అయితే దీని ఏపీఐలను ఉపయోగించుకుని ఏ వెబ్‌సైటయినా సరే ఆఫ్లైనులో ఉపలబ్ధమయేలా చేసుకోవచ్చు.
ఎప్పుడో ఈ సాఫ్ట్‌వేరుని గూగుల్ వాడు విడుదల చేసినా దీని ఉపయోగం మాత్రం విరివిగా ఈ మధ్యనే చేస్తున్నాడు. ఆసక్తికరమయిన విషయమేమిటంటే గూగుల్ తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేరుని ఉపయోగించి జోహో లాంటి ఇతర సంస్థలు గూగుల్ కంటే ముందుగానే ఈ ఆఫ్లైను సర్వీసుని తమ ఉపకరణాలలో చేతనపరచడం.
అయితే లేటుగానయినా గూగుల్ వాడు ఎన్నో ఉపకరణాలలో గూగుల్ గేర్స్‌ని ఉపయోగించి ఇప్పుడు అందరికీ ఈ ఆఫ్లైను ఫీచర్లను అందిస్తున్నాడు. ప్రస్తుతానికి గూగుల్‌కి చెందిన ఈ కింది ఉపకరణాలలో ఆఫ్లైను సౌకర్యం లభ్యమవుతుంది:
గూగుల్ రీడర్ - మీ ఆరెసెస్ ఫీడ్లను మీకు అవసరమయినప్పుడు అంతర్జాలానికి అనుసంధానమయి లేకపోయినా చదువుకోవచ్చు.
జీ మెయిలు - జీ మెయిలు లాబ్స్ కి చెందిన వివిధ ఆప్షన్లలో ఇది ఒకటి. దీనిని చేతనం చేస్తే మీరు మీ జీమెయిలు కి చెందిన మెయిళ్ళను అంతర్జాలానికి అనుసంధానమయి లేకపోయినా చదువుకోగలరు.
ఇంకా చెప్పాలంటే మీరు ఆఫ్లైనులోనే మీ మెయిళ్ళు రాసుకుని దాచుకోవచ్చు. అంతర్జాలానికి అనుసంధానం కాగానే మీ మెయిళ్ళు పంపబడతాయి. అలానే కొత్తగా వచ్చిన మెయిళ్ళు దిగుమతి అవుతాయి. ఇది నా వరకూ అత్యంత ఉపయోగకరం.
గూగుల్ డాక్స్ - వర్డు, ఎక్సెలు లాంటి ఉపకరణాలు ఈ గూగుల్ డాక్స్‌లో లభ్యం. ఇప్పుడు మీరు డాక్స్‌లో తయారు చేసుకున్న ఫైళ్ళను ఎంచగ్గా ఆఫ్లైనులో కూడా పొందగలరు. వాటిని మార్చుకోనూ గలరు. మీరు అంతర్జాలానికి అనుసంధానం కాగానే మీరు చేసుకున్న మార్పులు ఆన్లైనులోనూ చెయ్యబడతాయి.
రిమెంబర్ ద మిల్క్ - మీ చేయాల్సిన పనుల జాబితాను, టాస్కు లిస్టులను ఇందులో పెట్టుకోవచ్చు. గూగుల్ వాడిదే అయిన దీనిలోనూ గేర్స్ చేతనం అయి ఉంది.
గూగుల్ కాలెండర్ - ఇది కాలెండరు అప్లికేషను. మీకు సంబంధించిన కార్యకలాపాలను ఇందులో మేనేజ్ చేసుకోవచ్చు. దీనిలోనూ గేర్స్ చేతనం అయి ఉందని అంటున్నా ఇంకా అందుబాటులోకి రాలేదు
ఇవే కాక గూగుల్‌కి చెందని జోహో ఉపకరణాలలోనూ, వర్డుప్రెస్‌లోనూ ఇంకా చాలా వాటిలోనూ గూగుల్ గేర్స్ ఉపయోగించబడుతుంది. గూగుల్ గేర్స్ మీకూ కావాలంటే మీరు దానిని ఇక్కడ నుంచి దిగుమతి చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి గేర్స్ ఫైర్‌ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, సఫారీ, క్రోమ్‌లలో లభ్యం. గేర్స్ స్థాపించుకున్న తరువాత మీరు ఆయా వెబ్‌సైట్లకి వెళ్ళి వాటిలో ఆఫ్లైను చేతనం చేసుకోవచ్చు.
ఇంకొన్ని ఆసక్తికరమయిన టెకీ వార్తలు:
- జీమెయిల్ లాబ్స్‌లో ఇంకా ఎన్నో ఆసక్తికరమయిన ఆప్షన్లు ఉన్నాయి. ఉదా: "multiple inboxes". దీని ద్వారా ఒకేసారి మీ జీమెయిలు ఇన్‌బాక్స్‌లో ఎన్నో వ్యూలు ఏర్పాటు చేసుకోవచ్చు. మీ starred items, labels వగయిరాలని విడివిడిగా ఒకేసారి మీ ఇన్‌బాక్స్‌లో చూసుకోవచ్చు.
- ఇవాళ డెబియన్ లెన్నీ విడుదల అయింది. ప్రయత్నించండి. ఉబుంటుకి మాతృక అయిన డెబియన్ సరికొత్త రిలీజు ఇది.
- మైక్రోసాఫ్టు ఇప్పుడు రీటెయిల్ స్టోర్స్ ప్రారంభిస్తుందిట.

9 comments:
mee blog chala bagundhi... choosthunte meeru dheeni chala regular ga update chesthunnatu unnaru... ee post lo google features gurunchi chala baaga cheparu.
small correction. రిమెంబర్ ద మిల్క్ గూగుల్ వాడిది కాదు.
మంచి సమాచారం..ధన్యవాదాలు
@ Unknown!!!, @ బాబు:
థాంక్స్.
@ Anonymous:
గూగుల్ వాడు అక్వైర్ చేస్తే అది వాడిదే కదా :-)
చాలా ఇన్ ఫర్మేటివ్ గా ఉంది...!
free telugu cinema songs downloads,free telugu movies ,ap poltics,pawan kalyan,chiranjeevi photos,telugu moviestelugu songs, telugu cinema, telugu news, actress photos, movie reviews, actors and actress pictures,videos, wallpapers, chiranjeevi big wallapers,chiranjeevi big photos.
http://www.vebtoday.com
Very informative. Useful article.
@ shankar, @ cbrao గారు:
థాంక్యూ!
Good one...very informative
Post a Comment