ఇంతకు ముందోసారి నేను సమాచారం మన జీవితాలకు ఎలా భారమవుతుందో చెప్పడానికి ప్రయత్నించాను. అయితే అవసరమయినప్పుడు తగినంత రీతిలో ఈ సమాచారం సేకరించడం కూడా చాలా ముఖ్యం.
ఈ సేకరణకి నేను ఉపయోగించే పద్ధతులలో రెండు ప్రముఖమయినవి నేను ఎలా ఉపయోగిస్తానో చెబుతాను.
ఆరెసెస్ ఫీడ్లు: అన్నిటి కన్నా ఎక్కువగా సమాచారం కోసం నేను ఉపయొగించేది ఆరెసెస్ ఫీడ్లు. ఆరెసెస్ ఫీడ్లను చదవడానికి నేను వాడేది "గూగుల్ రీడర్".
ఇప్పుడు దాదాపు ప్రతీ వెబ్‌సైటుకీ, బ్లాగుకీ ఆరెసెస్ ఫీడ్లు ఉంటున్నాయి. అయితే అవసరానికన్నా ఎక్కువ ఫీడ్లకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అనవసరంగా సమయం ఖర్చవుతుంది.
ఇలా కాకుండా ఉండడం కోసం నేను ఈ కింది చిట్కాలు పాటిస్తాను.
౧. అవసరం అనుకుంటే గానీ ఆ ఫీడుని నా ఫీడు రీడరులో చేర్చను. మీరు ఒక ఆసక్తికరమయిన వ్యాసం చదువుతున్నారనుకోండి ఏదో వెబ్‌సైటులో ఠక్కున దానిని మీ ఫీడు రీడరులో చేర్చుతారు.
అయితే దీని వల్ల అనేక నష్టాలు. ఆ వెబ్‌సైటు కన్సిస్టెంటుగా మంచి వ్యాసాలు వ్రాయదనుకోండి. మీకు అనవసరంగా సమయం వృధా. అందుకని ఏదయినా ఫీడుకి సబ్‌స్క్రైబ్ చేసే ముందు ఆలోచించండి అవసరమో లేదో.
౨. ఫీడ్లను చదవాల్సిన ప్రయారిటీలో అమర్చుకుంటాను. ఉదా: నా ఫీడ్లు ఈ కింది విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను.
ఇందులో "Daily Dose" మాత్రమే రోజూ చూసేవి. అందులో టెక్నాలజీకి సంబంధించినవి ప్రముఖంగా ఉంటాయి. అది నా ఇంటరెస్టు కాబట్టి. మిగతా ఫీడ్లు అన్నీ విడిగా విభజించి ఉంటాయి. వాటిని సమయానుకూలంగా చదువుతాను.
౩. కూడలిలో అన్ని బ్లాగులనూ మొదట్లో చదివేవాడిని. అవి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు. తర్వాత రాను రానూ బ్లాగుల సంఖ్య పెరిగిన కొద్దీ అది కుదరలేదు. కొన్నాళ్ళు వ్యాఖ్యల నుండి టపాలు చదవడానికి ప్రయత్నించాను. అంటే ఎక్కువ వచ్చినవో లేక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు వచ్చినవో చదివేవాడిని.
తర్వాత అదీ కుదరలేదు. నాకు నచ్చిన బ్లాగుల ఫీడ్లను నా ఫీడు రీడరులో లేదా ఫాలోవర్స్ లిస్టులో జత చేసుకుని చదువుకునే వాడిని. కానీ కొన్ని మంచి టపాలు చదవలేకపోయేవాడిని.
అందుకని ఇప్పుడొక కొత్త పద్ధతి మొదలుపెట్టాను. మన టపాలలో కొంత మంది ఠంచనుగా మంచి టపాలకి వ్యాఖ్యలు వ్రాస్తారు. అలాంటి టపాలన్నీ చదివితే బాగుంటుందని యాహూ పైప్స్‌లో కూడలి ఫీడుని ఉపయోగించి చేసి ఒక పైపు సృష్టించుకున్నాను.
ఇప్పుడు బాగుంది. అవసరమయిన టపాలన్నీ చదవగలుగుతున్నాను.
కావలసిన వారు ఆ పైపుని ఇక్కడ నుంచి కాపీ చేసుకుని వాడుకోవచ్చు.
౪. రోజులో ఒక నాలుగైదు సార్లు వార్తలు చదవడం నాకు అలవాటు. తెలుగు దినపత్రికలను ఆన్‌లైనులో చదవను. ఈనాడుని పొద్దున లెగుస్తూనే చదవడం అలవాటు.
కానీ "ఈ పత్రికల"కి నా ఫీడు రీడరులో స్థానం లేదు. వాటిని మంటనక్కలో లైవ్ ఫీడ్లుగా ఏర్పాటు చేసుకున్నాను. ఒక్క మౌజ్ క్లిక్కుతో ఇప్పుడు వార్తలు నాకు లభ్యం.
ట్విట్టర్: ఇకపోతే ఆరెసెస్ తర్వాత సమాచారం కోసం నాకు ఉపయోగపడేది "ట్విట్టర్". మైక్రోబ్లాగింగుకి పుట్టినిల్లయిన ట్విట్టర్ ఈ మధ్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యధిక జనం చేత వాడబడేది కూడాను.
బ్లాగింగు నుంచి జనాలు చాలా మంది దీని వైపుకి మళ్ళారనడం అతిశయోక్తి కాదు. సమాచారాన్ని రియల్ టైములో చేరవేయడంలో ఇది బ్లాగుల కంటే శక్తిమంతమయినదిగా నిరూపించబడింది.
ఉదా: ముంబైలో టెర్రరిస్టుల ఘాతుకం నాకు ముందుగా దీని ద్వారానే తెలిసింది. వివిధ నగరాలలో బాంబు బ్లాస్టులు కూడా.
అలాగే విండోసు 7 బీటా గురించీ, బెంగుళూరులో జరుగుతున్న కాన్సర్టుల గురించీ, టెక్నాలజీ కాన్ఫరెన్సుల గురించి కూడా దీని ద్వారా ముందుగా తెలుస్తాయి నాకు.
అయితే నేను దీనిని ఇంకా సమర్థంగా వాడవచ్చు.
ఇందులో కూడా నేను కొన్ని చిట్కాలు పాటిస్తాను.
౧. కనిపించిన ప్రతీ ఒక్కరినీ ఫాలో కాను. మళ్ళీ అది స్పాముని సృష్టిస్తుంది. వాళ్ళ ట్వీట్స్‌ని గమనించి అవి ఆసక్తికరంగా ఉంటేనో లేదా వారు నాకు మంచి స్నేహితులయి ఉంటేనో వారిని ఫాలో అవుతాను.
౨. ఎక్కువ ట్వీట్లను చదవడం బ్లాగులకి లాగానే కష్టం. అందుకని నేను "ట్వీట్ డెక్" అనే ఉపకరణాన్ని వాడతాను. అందులో నేను ఇంతకు ముందు ఫీడు రీడరులో విభజించుకున్నట్టే ట్వీట్లను విభజించుకునే సౌలభ్యం ఉంది.
అంటే నా స్నేహితులను విడిగా, టెక్నాలజీ ట్వీటర్లను విడిగా, అలాగన్నమాట.
౩. దీనిని ట్విట్టర్ ఫాక్స్ అనే పొడిగింతతో మంటనక్కలోనూ ఉపయోగిస్తాను.
౪. గంటకోసారి ఒక రెండు నిముషాలు ట్విట్టర్ వైపు చూస్తే కావలసిన సమాచారమంతా చటుక్కున లభిస్తుంది.
ముఖ్యంగా నాకు కావలసిన సమాచారం పై రెండిటి ద్వారా లభిస్తుంది.
అయితే వీటి నుండి సేకరించిన సమాచారాన్ని కూడా ఒక పద్ధతిలో పెట్టుకోవాలి. ఉదా: మీకు ఆసక్తికరంగా అనిపించిన వ్యాసాన్ని మంట నక్కలో ఒక ఫోల్డరు సృష్టించి వాటిలో పేజీకలు(bookmarks)గా పెట్టుకోవచ్చు లేదా తర్వాత చదువుకోవడానికి/ఇతరులతో పంచుకోవడానికి గూగుల్ రీడరులో "షేర్డు ఐటెమ్" గానో "స్టార్డ్ ఐటెమ్" గానో పెట్టుకోవచ్చు. నేను చాలా మటుకు ఇదే చేస్తాను. గూగుల్ రీడరులో నా స్నేహితులకు తెలుసు నేను ఎంత స్పాము సృష్టిస్తానో దీనివల్ల. :-)
ఇవి కాక నాకు నచ్చిన వ్యాసాన్ని డెలీషియస్ మంట నక్క పొడిగింతతో బుక్‌బార్క్ చేసుకుంటాను.
వ్యాసాన్నో, దాంట్లో ఒక భాగాన్నో వెంటనే క్లిప్ చేసి దాచుకుంటాను రిఫరెన్సు కోసం. దీనికి ఇంతకు ముందు ఎవర్‌నోట్ వాడేవాడిని. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్‌నోట్ వాడుతున్నాను. లినక్సులో అయితే ఎవర్‌నోట్ ఆన్లయిన్ క్లిప్పింగ్ ఉపకరణాన్ని వాడతాను.
ఇన్ని తిప్పలెందుకు పడాలి, నాకు సమాచారంతో అవసరమే లేదంటారా ? అలాగే కానీండి :-)




10 comments:
చాలా ఉపయోగ కరమైన విషయాలు ప్రవీణ్. ఒక నిమిషం క్రితం చేతిలో ఉన్న పెన్ను ఇప్పుడు ఎక్కడ ఉందో అని పైనా కిందా వెతుకునే నాలాంటి వాడికి ఈ ట్రిక్కులు ఉపయోగపడతాయి. ఎటొచ్చీ ఇబ్బది ఏంటంటే, వీటిని కాస్త శర్ద్ధగా ప్రాక్టీసు చెయ్యాలి!
Praveen,
Thanks a Ton buddy.Very useful info.Your post solved a couple of my long standing problems.Still need to work with pipes..
Thanks again...Good work..
"ఇలా చేస్తా"నంటూనే ఎలా చెయ్యాలో తెలియజేశారు. నెనర్లు. ఈ ఫీడ్ ల గొడవేంటో నాకింతవరకు సరిగా కొరుకుడు పడింది కాదు. దాని గురించి ఎక్కడైనా ట్యూషన్ లో చేరాలి.
ప్రవీణ్,
మీ పోస్టు పుణ్యమా అని గూగుల్ రీడర్ లో నేను రెగ్యులర్ గా చదివే బ్లాగులన్నీ జత చేసుకున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది మీ బ్లాగు ని జత చేయలేదని. ఎంత కృతఘ్నుణ్ణో కదా.. Sorry, Now you are there in my list :) I am a regular reader of your blog
Praveen garu chala chakka vivaraincharu Google reader nizamga chala upayogakaram anni rss feeds akkadanunche chadavachu ,mi tiwtter link blog lo kanapdalede naku.
@ కొత్త పాళీ:
గొప్పగొప్ప వాళ్ళు అలాగే పరధ్యానం కలిగి ఉంటారు లెండి. :)
@ ఉమాశంకర్:
కృతజ్ఞతలు! టపా ఉపయోగపడినందుకు సంతోషం.
@ తాడేపల్లి గారు:
ఉపయోగపడుతుందంటే చాలా కాలం క్రితం వ్రాసిన నా ఇంతకు ముందు టపా ఒకసారి చూడండి.
@ venkat:
నేను ఎక్కువగా అందులో టెక్నాలజీ కాక మామూలు విషయాలు ట్వీట్ చేస్తాను. అందుకే దాని లంకె ఇవ్వలేదు.
నా ట్విట్టర్ లంకె ఇది.
ప్రవీణ్ గారూ ! మీకభ్యంతరం లేదంటే ఆ వ్యాస విషయాల్ని మీ పేరుతో నా బ్లాగు పుస్తకంలో ఉటంకిస్తాను.
@ తాడేపల్లి గారు:
"attribution"తో మీరు నా బ్లాగులో ఏ టపానన్నా ఉపయోగించుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు.
Nice post.
chaala upyogakaranga undi. I'm reading your blog for some time and felt this has been more informative post for me.
@Souju:
మీకు ఈ టపా ఉపయోగపడినందుకు సంతోషం.
మీరూ తెలుగులో వ్రాయాలనుకుంటే లేఖిని చూడండి.
Post a Comment