మీ జీవితం రొటీనుగా సాగుతోందని మీకనిపిస్తోందా ?
పొద్దున్న లెగాలి, పళ్ళు తోముకోవాలి, ఆఫీసుకెళ్ళాలి, ఇంటికి రావాలి, పడుకోవాలి.... ఇలాంటి "ToDO List" మీ జీవితంలో భాగమయిందా ?
అయితే మీరు దస్విదానియా చిత్రంలో అమర్ కౌల్ (వినయ్ పాఠక్) టైపన్నమాట. ఒక రహస్యం! మనలో తొంభై శాతం మంది ఈ కోవకి చెందిన వారమే.
జీవితాలలో ఒక నూతనత లేదు, ఎలాంటి ఎక్సయిట్‍మెంటూ లేదు అనుకునే వారు ఒక నిముషం ఆగి అలా ఎందుకు అని ఆలోచించరు. అలా ఆలోచించటానికి సమయం దొరకదు.
కానీ అలాంటి అవకాశం దొరికితే, దేనికీ భయపడనక్కరలేని సందర్భమే వస్తే ? మన జీవితం ఇంకో విధంగా మారుతుందా ?
ఇలాంటి కథా వస్తువుతో తీసిన సినిమా "దస్విదానియా". అమర్ కౌల్ అకౌంట్స్ మేనేజరుగా పని చేసే ఒక మామూలు మనిషి. "కూరలు కొనుక్కురావాలి, అమ్మకి చెవిటి మిషను బ్యాటరీ తీసుకురావాలి" లాంటి ToDo Lists తయారు చేసుకునే బాపతు. జీవితంలో కొట్టుకుపోతూ ఎలాంటి అనుభవాలూ మిగుల్చుకోని ఒక మనిషి.
అయితే అతనికి ఉన్నట్టుండి ఒక రోజు స్టమక్ కాన్సర్ అని తెలుస్తుంది. ఎంతో కాలం బతకడని తెలుస్తుంది. అప్పటి నుంచీ అతనిలో ఆత్మ శోధన మొదలవుతుంది. ప్రతీ రోజుకీ సంబంధించిన పరిధులని దాటి ఆలోచించడం మొదలుపెడతాడు. అతనికి ఎప్పటి నుంచో సాధ్యం కాని కోరికల కొత్త ToDo List తయారు చేసుకుంటాడు.
అయితే చివరికి వాటిని సాధించగలిగాడా లేదా అనేదే ఈ సినిమా కథ.
వినయ్ పాఠక్‍ని ఇంతకు ముందు కొన్ని సటైరికల్ కామెడీ పాత్రలలో చూసినా అతని సత్తా చూపించిన సినిమా నాకు మటుకు "భేజా ఫ్రై" (దీని గురించి ఇంకోసారి). ఒక చిన్న సన్నివేశం తీసుకుని దాన్నుంచి అద్భుతమయిన కథనం అల్లి చక్కని కామెడీ సృష్టించడంలో చాలా బాగా సఫలమయిన సినిమా అది. నాకు చాలా బాగా నచ్చింది. వినయ్ నటన, అతని కామెడీ టైమింగు చాలా బాగుంటాయి ఆ సినిమాలో.
ఇక "దస్విదానియా" కామెడీ కాదు, అలాగని పూర్తి స్థాయి సీరియస్సూ కాదు. అది ఒక మనిషి revelation. అతన్ని అతనే కనుగొనే ఒక కథ. (వినయ్ పాఠక్ సొంత నిర్మాణం)
సాధారణ జనాలు తమ జీవితాలతో సంతృప్తి చెందకపోయినా దాని గురించి ఏమీ చెయ్యని స్తబ్ధతలో జీవిస్తూ ఉంటారు. అలాంటి స్తబ్ధత నుంచి బయటకు రావడానికి వారికి ఒక కుదుపు కావాలి. తమని కదిపివేసే ఒక సంఘటన జరగాలి.
తను ఎంతో కాలం బతికి ఉండనని తెలిసిన అమర్ కౌల్ ఇక తన మిగిలిన జీవితాన్ని తనలో ఎంతో కాలం నుంచి అదిమి పెట్టిన కోర్కెలని తన కొత్త ToDO List గా మార్చుకుంటాడు. వాటిని సాధిస్తాడు.
ఏమీ కొత్తదనం లేదని అనిపిస్తుందా ? కావచ్చు. కానీ తీసిన విధానం నాకు నచ్చింది. ఒక మంచి సినిమా తీయడానికి తారలు అక్కర్లేదు, కనీసం పూర్తి ఒరిజినాలిటీ ఉన్న కాన్సెప్టు కూడా అక్కర్లేదు (ఇకిరు, ద బకెట్ లిస్ట్ అనుకరణ అని కొన్ని చోట్ల చదివాను). తీసే విధానంలోనే కొత్తదనం చూపించవచ్చు అని వినయ్ పాఠక్ నిరూపించాడు. చిత్రంలో చాలా మటుకు సన్నివేశాలు హృద్యంగా ఉన్నాయి. తన చిన్ననాటి ప్రేమ అయిన నేహా ధూపియాకి ఐ లవ్ యూ చెప్పడం, తన చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి ఫారిన్ ట్రిప్ వెయ్యడం. అక్కడ అనుకోకుండా లవ్ దొరకడం...
చిన్న సినిమాలలో సృజనాత్మకత బాగుండడం నాకు ఆనందం కలిగిస్తుంది. ఏదయినా కాకపోయినా కనీసం కొంత retrospection కోసమయినా ఈ సినిమా పనికొస్తుందేమో ? :-)
ఈ మధ్యన వచ్చిన సినిమాలలో తప్పకుండా చూడదగినది!
* "dosvidaniya" అంటే రష్యన్‍లో "Good Bye" అని అర్థం.
Saturday, December 06, 2008
Labels: దస్విదానియా, వినయ్ పాఠక్, సినిమా, సినిమాలు
Subscribe to:
Post Comments (Atom)

6 comments:
ప్రవీణ్ గారూ..
సినిమా గురించి మీరు బాగా చెప్పారు. vinay pathak నిర్మాత అనీ, dosvidaaniya అంటే రష్యన్ లో goodbye అని నాకు మీ post చూసాకే తెలిసింది.
ఈ సినిమా నాకు కూడా చాలా చాలా నచ్చిందండీ.. నాలుగు రోజుల క్రితమే చూసాను నేను. ఎన్నో రకాల ఆలోచనలు ముసురుకున్నాయి నన్ను ఈ సినిమా చూసినంతసేపూ.. కొన్ని సన్నివేశాల్లో చాలా emotional గా ఫీల్ అయినాగానీ.. సినిమా చివరిదాకా చూసాక.. ఎందుకో చాలా సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది. అసలు చచ్చిపోతానని తెలియడం వల్లనే కదా.. అతను చివరి రోజులయినా సంతోషంగా అనుకున్న విధంగా బతికాడు. మనం కూడా అంతే కదా.. అలా తప్పనిసరిగా పోతాం.. అంటేనే గానీ మనం అలా చేయాలనుకోము. కానీ, ఏదో ఒక రోజు మనం పోవాల్సిందేగా అనుకుని.. ఆ లెక్క ప్రకారం.. మనం కూడా ప్రతీ క్షణం ఆస్వాదించాలి కదా..! ఏమో implement చేయడానికి ప్రయత్నిద్దాం.. అనిపించింది నాకు.. :)
ఊ..చూడవల్సిన సినిమా, చూడదగ్గ సినిమా! రైల్లో ప్రయాణం చేసేట్టప్పుడే మన స్టేషను దగ్గరలో వచ్చేంత వరకూ ఎంత నింపాదిగా ఉంటాం. In a way, we find all sort of comforts in that li'l compartment. స్టేషను రాగానే, ఎంత హడావిడి. హమ్మ్.. ఇక జీవిత ప్రయాణం అంటే..!!
ఈ సినిమా స్టోరీ తెలిసే వెళ్ళాను. ఏడ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా లైట్ హార్టెడ్ గా సాగింది. In most ways, it's celebration of life. నాకు మాటిమాటికీ Randy Pausch గుర్తొచ్చారు చాలా చోట్ల.
A nice write up about a very good movie!
వినయ్ పాఠక్‍దే "ఓహ్..మై గాడ్" వస్తుంది. చూడాలి అది కూడా!
ఈ సినిమా బావుంది అని చాలా మంది చెప్పారు... కనీసం ఈ వీకెండ్ అయినా చూడాలి..
భేజా ఫ్రయ్ కూడా నాటకం ఆధారంగా తీసిన ఒక ఫ్రెంచ్ సినిమా(డిన్నర్ గేం)కి కాపీనే. మంచి సినిమాల్ని కాపీ కొడితే తప్పేం కాదు గానీ అది వాళ్ళే పైకి చెప్పుకుంటే కొత్త భ్రమలేమీ పుట్టవు గదా!
అయితే చూస్తా ఈ సినిమా.
ఇంత వరకూ సినిమా చూస్తూ కన్నీల్లు కార్చే వాల్లని చూసి నవ్వుకునేవాడిని. కానీ ఈ సినిమా చూసాకే తెలిసింది నేను కూడా తక్కువేం కాదని :)
Post a Comment