.మొన్న సెప్టెంబరు ౩౦ న ఉబుంటు ఇంకొక సరికొత్త నవీకరణ (8.10) విడుదలయింది. (ఇంట్రెపిడ్ ఐబెక్స్, ఇంకో చిత్రవిచిత్రమయిన పేరు :)
* ఉబుంటు మీద ఇంతకు ముందు నా టపాలు ఇక్కడ చూడవచ్చు.
ఇది LTS (Long Term Support) రిలీజు కాదు. కాకపోతే కొన్ని చక్కని మార్పులు చేసారు ఇందులో.
మీరు ఇప్పటికే ఉబుంటు 8.04, హార్డీ హెరాన్ గనక ఉపయోగిస్తున్నట్టయితే ఈ రిలీజుకి నవీకరించడానికి ఈ కింది కమాండుని ఉపయోగించండి.
sudo apt-get dist-upgrade
౧. గ్నోమ్ 2.24: ఉబుంటు ఇంట్రెపిడ్‌లో గ్నోమ్ కొత్త నవీకరణ 2.24 ని జతచేసారు.
౨. గెస్ట్ సెషన్: మీరు మీ కంప్యూటరుని వాడుతున్నారు. మీ స్నేహితుడో, మీ ఇంట్లో వాళ్ళో కాసేపు కాసేపు మీ కంప్యూటరుని వాడాలనుకున్నారు. కానీ మీ సిస్టంని వారికి అప్పగించడానికి మీకు ఇష్టముండకపోవచ్చు. మీ ప్రైవేటు ఫైళ్ళు ఎవరయినా చూస్తారేమోనని లేదా ఏదయినా ఫైళ్ళు పొరపాటున తొలగిస్తారని భయముండవచ్చు.
అలాంటి పరిస్థితులలో ఉపయోగించడానికే ఈ కొత్త వర్షనులో గెస్ట్ అకౌంటుని జతచేసారు. మీరు ఎంచగ్గా ఆ అకౌంటుకి స్విచ్ చేసి మీ స్నేహితులకి సిస్టం అప్పగించవచ్చు. ఆ అకౌంటు ద్వారా సిస్టంలో ఏ మార్పులూ చెయ్యలేరు. ఏదయినా చేసినా అవి /tmp ఫోల్డరులోకి వెళతాయి కాబట్టి లాగౌట్ అయిన వెంటనే అన్నీ మాయం.
౩. ప్రైవేటు ఫోల్డరు: మీ సిస్టంలో ఎవరూ చూడదనుకున్న ఫైళ్ళు ఉన్నాయనుకోండి. అది మీ అకౌంటుకి తప్పితే ఎవరూ ఆక్సెస్ చెయ్యకూడదనుకుంటే ఆ సదుపాయం ఈ వర్షనులో ఉంది.
ఈ కింది కమాండులను మీ సిస్టంలో ఇవ్వండి
sudo apt-get install ecryptfs-utilsఇప్పుడు మీ హోమ్ ఫోల్డరు (/home/
ecryptfs-setup-private
౪. యూఎస్‌బీ డిస్క్: ఇప్పుడు మీరు మీ ఉబుంటు ఇన్‌స్టాలేషనుని మీరు ఇప్పుడు మీతో పాటూ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళవచ్చు. ఇది తయారు చెయ్యడానికి ఒక ఉపకరణం ఇంట్రెపిడ్‌లో జత చేసారు.
కాకపోతే దీనికోసం మీకు ఉబుంటు ఇంట్రెపిడ్ iso కానీ సీడీ కానీ అందుబాటులో ఉండాలి. ఈ ఉపకరణం మీ ఉబుంటుని యూఎస్‌బీ మీదకి కాపీ చేస్తుంది. మీ సెట్టింగులు గట్రా కూడా యూఎస్‌బీ మీదే ఉంటాయి.
౫. నాటిలస్ లో ఇప్పుడు టాబులు: గ్నోమ్ నాటిలస్ ఫైలు మేనేజరులో ఇంతకు ముందు వరకూ టాబులు లేవు. ఈ రిలీజులో ఆ ఫీచరు ఉంది.
౬. కేడీయీ 4.1: కేడీయీ వర్షనయిన కుబుంటులో ఈ సారి కేడీయీ 3.5 నుంచి 4.1 కి నవీకరించబడినది. ఇది ఒక పెద్ద మార్పు. ఎందుకంటే కేడీయీ 4 ఇంతకు ముందు కేడీయీ వర్షనులకంటే సమూలంగా మార్పు చెందింది. దాని గురించి నా ఇంతకు ముందు టపా చూడవచ్చు.
ఇవి కాక ఇతర ఉపకరణాలన్నీ నవీకరించబడినవి.
గత కొంత కాలంగా ఇంట్రెపిడ్ ఆల్ఫా వాడుతున్న నా అనుభవాలు:
౧. కేడీయీ 4.1 నాకు అంతగా నచ్చలేదు. సంపూర్ణంగా స్టేబుల్ అయిన పాడక్టు కాదని నా అభిప్రాయం. అవడానికి చక్కని ఐ కాండీ అయిన ఈ వర్షను ఇంతకు ముందు వర్షనయిన కేడీయీ 3.5 అంత స్టేబుల్ గా లేదు.
ఇంకా చెప్పాలంటే గత కొంత కాలంగా నేను కేడీయీ లోకి లాగిన్ అవలేకపోయాను. లాగిన్ అవగానే ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది నాకు పెద్ద ఫ్లాప్. కానీ మిగతా వారికి సరిగానే పని చేస్తున్నట్టుంది.
౨. ఎవల్యూషన్ యొక్క సరికొత్త నవీకరణలో సమస్యలున్నాయి. OWA https యూఆర్‌ఎల్ తో ఇది సరిగా పని చెయ్యదు. కాబట్టి మీ కంపెనీ కనుక మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ వాడుతుంటే మీరు ఐమాప్ ప్రోటోకాలు ఉపయోగించాలి లేదా మీ ఎక్చేంజ్ సర్వరు http ప్రోటోకాల్‌కి మద్దతునివ్వాలి.
౩. ఎక్స్ విండోస్ ఈ రిలీజులో చాలా నిలకడగా ఉంది. డ్యూవల్ మానిటర్ సెటప్ లాంటివి సులభంగా చెయ్యవచ్చు.
౪. నెట్‌వర్క్ మేనేజరు చాలా చక్కగా పని చేస్తుంది ఈ రిలీజులో. మీ ఇంటర్ఫేసులన్నిటినీ ఇది అద్భుతంగా నిర్వహిస్తుంది. వైర్‌లెస్ సమస్యలు దాదాపుగా తీరినట్టే.
చివరగా నా ఇంట్రెపిడ్ గ్నోమ్ డెస్కుటాపు చిత్రంతో ముగిస్తాను :)
Loading image
Click anywhere to cancel
Image unavailable


1 comments:
మంచి వివరణ... దీని గురించి చదవడమే తప్ప, ఉపయోగించలేదు ఇంతవరకు...
Desktop pic బావుంది..
Post a Comment