హహహ... విహారి గారి ఈ టపా చూస్తే గుర్తొచ్చింది.
ఓ సారి ఇలాగే ఓ కాండిడేట్ ని టెలీఫోనిక్ ఇంటర్వ్యూ చెయ్యడానికి ఫోను చేసాను.
కాండిడేట్ హైదరాబాదు నుంచి. అవతల పక్కనుంచి "ఎయ్ పోటు ఎయ్ పోటు" అంటూ జెమినీ చిత్రం నుంచి పాట, హెలో ట్యూన్ అన్నమాట.
ఇక నేను మా కొలీగు ఐదు నిమిషాలు ఒకటే నవ్వు.
ఆ తర్వాత పోటేసామనుకోండి ;) అది వేరే విషయం.
5 comments:
ఈ అనుమానం నన్ను భూతమై వేధిస్తోంది.
మనం అవతలి వాడికి ఫోన్ చేస్తే వాడి రింగ్ టోన్ ఏదైతే అది మనకు వినిపిస్తుందా? స్తాండర్డ్ రింగ్స్ కాదా?
నాకు తెలిసి మనం ఎన్నుకొనే రింగ్ టోన్ మనకు ఫోన్ వచ్చినపుడు మనకు వినపడతానికి కానీ చేసిన వాడికి వినపడటానికి కాదు కదా!
--ప్రసాద్
http://blog.charasala.com
ఇప్పుడు కాలర్ ట్యూన్స్, హెలో ట్యూన్స్ అని కొత్తగా (మరీ కొత్తగా కాదు) వచ్చాయి లేండి. మనకు ఫోను చేసిన వాళ్ళ నంబర్ ప్రకారం ఏ ట్యూన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, నేను ఫోను చేసినతను అందరికీ ఒకే పాట పెట్టినట్టున్నాడు.
ప్రసాద్ గారూ, భారతదేశం అమెరికాని ఎప్పుడో మించిపోయింది. అమెరికాలో హలో ట్యూన్స్ లేవేమో?
హలో ట్యూన్సు....డబ్బు మనది సరదా అవతలోడికి
ఇండియా అమెరికాని మించిపోయిన సంగతి తెలుసుగానీ ఈ "హలో త్యూన్స్" సంగతి తెలియదు సుమా!
సెల్ ఫోన్ విషయంలో అయితే అమెరికా మరీ వెనక బడింది (నేనయితే మరీను).
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment